ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలూరు గ్రామ సర్పంచి భిక్షాటన.. ఎందుకంటే..? - కర్నూలు జిల్లా వార్తలు

Aluru Grama Sarpanch Begging : గ్రామాభివృద్ధికి నిధులు లేవని.. డబ్బులిచ్చి అభివృద్ధికి చేయూతనివ్వాలని కర్నూలు జిల్లాలో ఓ సర్పంచి భిక్షాటన చేశారు. పంచాయతీలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం తీసుకోవటంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆరోపించారు.

బిక్షాటన
బిక్షాటన

By

Published : Mar 13, 2022, 6:01 PM IST

Aluru Grama Sarpanch Begging : కర్నూలు జిల్లా ఆలూరు సర్పంచి అరుణాదేవి.. తన మద్దతుదారులతో కలిసి గ్రామంలోని దుకాణాలు తిరిగి భిక్షాటన చేశారు. గ్రామాభివృద్ధికి నిధులు లేవని.. డబ్బులిచ్చి అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు.

ఆలూరు గ్రామ సర్పంచి బిక్షాటన... ఎందుకంటే..!

పంచాయతీలకు సంబంధించి 14, 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం వల్ల గ్రామంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని సర్పంచి ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. పంచాయతీ నిధులు విడుదల చేయాలని కోరారు.

ఇదీ చదవండి :కర్నూలులో 'అఖండ' శత దినోత్సవం.. పోటెత్తిన అభిమానులు

ABOUT THE AUTHOR

...view details