ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటాం' - alla nani news updates

కర్నూలు కలెక్టరేట్​ను మంత్రి ఆళ్ల నాని సోమవారం సందర్శించారు. కరోనా నియంత్రణపై జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. వలస కూలీలు, విద్యార్థులకు సరిహద్దు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

alla nani about corona cases control
కరోనా నియంత్రణపై మాట్లాడుతున్న మంత్రి ఆళ్ల నాని

By

Published : Apr 7, 2020, 9:38 AM IST

రాష్ట్రంలో కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్​ కేసులు అత్యధికంగా ఉన్నాయని వెల్లడించారు. కరోనా నియంత్రణ, జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలపై కర్నూలు కలెక్టరేట్​లో మంత్రి సోమవారం సమీక్షించారు. లాక్​డౌన్​ సందర్భంగా వలస కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులకు సరిహద్దు ప్రాంతాల్లో 66 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వారికి భోజన, వసతి ఏర్పాట్లు చేశామని తెలిపారు.

గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో చిక్కుకున్న కర్నూలు జిల్లా వలస కూలీల కోసం ప్రత్యేకాధికారులను నియమించి వారికి అన్ని రకాల భోజన, వసతి సౌకర్యాలు చూసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కర్నూలులో కరనా టెస్టింగ్​ ల్యాబ్​ ఏర్పాటు చేసేందుకు ఐసీఎంఆర్​ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారి నుంచి నమానాలను సేకరించి పరీక్షించేందుకు హైదరాబాద్​లో ల్యాబ్​లకు పంపి త్వరగా నివేదికలు తెప్పిస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details