ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 6, 2021, 7:24 PM IST

ETV Bharat / state

కర్నూలులో కరోనా నియంత్రణపై.. అఖిలపక్ష సమావేశం

కరోనా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించటం ద్వారానే కొవిడ్​ని అరికట్టవచ్చని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. వైరస్​ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కర్నూలు నగరంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

all parties meeting
అఖిలపక్ష సమావేశం

కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో.. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. హాస్పిటల్స్​లో ఆక్సిజన్, బెడ్స్ కొరత, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రుసుములు, వాక్సినేషన్​ వంటి విషయాలపై చర్చించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ చర్చలో అన్ని పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. వారి సలహాలు, సూచనలు అందించారు.

కరోనాపై ప్రజలకు అవగహన కల్పించడం వల్ల వైరస్​ నియంత్రణ చేయవచ్చని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. అంతగా లక్షణాలు కనిపించకున్నా.. వైరస్​ పాజిటివ్​ వచ్చిన వారు ఇంటి వద్దే చికిత్స తీసుకోవాలని ఆయన సూచించారు. లక్షణాలు ఎక్కువగా ఉంటేనే ఆసుపత్రులకు వెళ్లాలని తెలిపారు. కర్నూలులో కొత్త వైరస్​పై అసత్య ప్రచారం జరుగుతోందని.. దానిపై ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details