కర్నూలు జిల్లా ఆదోనిలో కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆటో సీట్ కింద మద్యాన్ని ఉంచినట్టు గుర్తించారు. 235 మద్యం సీసాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా మద్యాన్ని తరలిస్తున్నఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఎవరైనా మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రామకృష్ణ హెచ్చరించారు.
కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత - కర్నూలు జిల్లా నేర వార్తలు
రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగడంతో రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణాకు తెర లేచింది. సరిహద్దు రాష్ట్రాల నుంచి కొందరు గుట్టుచప్పుడు కాకుండా మద్యాన్ని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
![కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత Alcohol moving from Karnataka is seize in adhoni kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7517421-845-7517421-1591537663805.jpg)
కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత