రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం చేస్తామని మద్య విమోచన ప్రచార కమిటీ కన్వీనర్ లక్ష్మణారెడ్డి అన్నారు. కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో సమావేశంలో మాట్లాడిన ఆయన... మద్యాన్ని పూర్తిగా నిషేధించేందుకే ధరలు పెంచుతున్నామన్నారు. అంతేకానీ ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవడం కోసం కాదన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు రాష్ట్రంలోని అన్ని టోల్ గేట్ల వద్ద బ్రీత్ అనలైజర్లు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచి అక్రమ మద్యాన్ని అరికడతామని చెప్పారు.
'మద్యం నిషేధించేందుకే ధరలు పెంచుతున్నాం' - alcohol latest rate news in ap
దశలవారీగా మద్య నిషేధం చేస్తామని మద్య విమోచన ప్రచార కమిటీ కన్వీనర్ లక్ష్మణారెడ్డి అన్నారు. ధరలు పెంచేది మద్యం నిషేదం కోసమే కానీ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం కాదని తెలిపారు.
alcohol liberation campaign committee convener press meet in kurnool