ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో దీక్ష చేపట్టిన అక్షయ గోల్డ్ బాధితులు - కర్నూలు వార్తలు

అక్షయ గోల్డ్ బాధితులు కర్నూలులో నిరసనకు దిగారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని శ్రీకృష్ణ దేవరాయల కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. భాజపా, జనసేన నాయకులు బాధితులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపారు.

Akshaya Gold
అక్షయ గోల్డ్ బాధితులు

By

Published : Jan 29, 2021, 3:09 PM IST

కర్నూలులో అక్షయ గోల్డ్ బాధితులు దీక్ష చేపట్టారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్నట్లుగా తమను కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకృష్ణ దేవరాయల కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం దీక్షా స్థలానికి చేరుకున్నారు. సీఎం జగన్ పాదయాత్రలో భాగంగా అక్షయ గోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. భాజపా, జనసేన నాయకులు బాధితులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details