అక్షయ గోల్డ్ బాధితులు.. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. కర్నూలు నుంచి హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కాగానే తొలి శాసనసభ సమావేశాల్లోనే తమ సమస్యను పరిష్కరిస్తానని జగన్ హామీ ఇచ్చారని బాధితులు పేర్కొన్నారు. తీరా గెలిచాక పట్టించుకోవట్లేదంటూ వాపోయారు. పార్టీ అధినేత తమకు న్యాయం చేయాలని కోరారు. తమ సమస్యపై అక్షయ గోల్డ్ ఆంధ్రప్రదేశ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ సభ్యులు మనోహర్‌కు వినతి పత్రం అందించారు.
జనసేనకు వినతిపత్రం అందించిన అక్షయ గోల్డ్ బాధితులు - Akshaya Gold victims news
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను అక్షయ గోల్డ్ బాధితులు కలిశారు. కర్నూలు నుంచి హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి మనోహర్‌తో మాట్లాడారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ వినతి పత్రం అందించారు.

ఎన్నికల ముందు మాట ఇచ్చి.. గెలిచాక సమస్య పరిష్కరించకపోగా.. న్యాయం చేయమని అడిగిన వారిని అరెస్టులు చేయించడం అన్యాయమని మనోహర్ అన్నారు. రాష్ట్రంలో అనేక సంస్థలు ఆర్థిక నేరాలకు పాల్పడి పేద, మధ్య తరగతి కుటుంబాలకు అపార నష్టం కలిగిస్తున్నాయన్నారు. ఖాతాదారులను, పెట్టుబడులు పెట్టించిన ఏజెంట్లకు న్యాయం చేయడంలో అక్షయగోల్డ్ సంస్థ, ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. అక్షయ గోల్డ్ ఆంధ్రప్రదేశ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ సభ్యులు తమ సమస్యలను విన్నవించుకున్నట్లు తెలిపారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని మనోహర్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఆర్థిక నేరాలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ రేఖ గౌడ్, వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు దీక్ష భగ్నం