'ఆన్లైన్ రమ్మీ కమ్మేస్తోంది' అంటూ 'ఈటీవీ భారత్'లో నిన్న కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు స్పందించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆయన ధర్నా నిర్వహించారు. ఆన్లైన్ రమ్మీని నిషేధించి, విద్యార్థి, యువత భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు.
'ఈటీవీ భారత్' కథనానికి స్పందన... ఆన్లైన్ రమ్మీపై ధర్నా - aiyf protest news in done
'ఆన్లైన్ రమ్మీ కమ్మేస్తోంది' అని ఈటీవీ భారత్‌లో వచ్చిన కథనానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్‌బాబు స్పందించారు. ఆన్లైన్ రమ్మీని నిషేధించి, విద్యార్థి, యువత భవిష్యత్తును కాపాడాలని కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఆయన ధర్నా చేపట్టారు.
ఆన్లైన్ రమ్మీని నిషేదించాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
ఈ గేమ్ ఆడడం వల్ల విద్యార్థులు, యువత తప్పుదోవ పడుతున్నారని ఆరోపించారు. లక్షల రూపాయలు పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి వెబ్సైట్లను రద్దుచేసి యువత తప్పుదోవ పట్టకుండా ప్రభుత్వం కాపాడాలని కోరారు. ఈ ఆట వల్ల జరిగే నష్టాలపై విద్యార్థులకు కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆన్లైన్ రమ్మీపై హైకోర్టులో పిటిషన్ వేసి ఈ వెబ్‌సైట్స్‌ను రద్దు చేసే వరకు పోరాడతామని లెనిన్ బాబు పేర్కొన్నారు.