Rahul Gandhi Bharat Jodo Yatra: కర్నూలు జిల్లాలో నాలుగు రోజుల పాటు భారత్ జోడో యాత్ర సాగింది. నాలుగో రోజు మంత్రాలయం నుంచి కర్ణాటక రాష్టంలోకి ప్రవేశించింది. యాత్రలో భాగంగా హాలహర్వి-చిలకలడోన మధ్య .. పత్తిపొలాల్లోకి వెళ్లిన రాహుల్ రైతులతో మాట్లాడారు. అధిక వర్షాలు, నాసిరకం విత్తనాలతో నష్టపోయామని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
విరామ సమయంలోవివిధ సమస్యలపై ప్రజా సంఘాల నాయకులు వేర్వేరుగా రాహుల్ గాంధీని కలిశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించాలని కార్మిక సంఘాలు, పంచాయతీల నిధుల విషయమై సర్పంచ్‌లు, ప్రత్యేకహోదా సహా విభజన హామీలు నెరవేర్చాలని పలువురు మేధావులు, ఎల్ఐసీని కాపాడాలని ఆ సంస్థ ఉద్యోగులు, ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ నాయకులు కలిశారు.