కర్నూలు జిల్లా అహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి యోగి వేమన అన్నసత్రం నిర్వాహకులు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 లక్షల విరాళం అందించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిని ఆయన నివాసంలో కలిసి చెక్కును అందజేశారు. కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి చేపడుతున్న సహాయ కార్యక్రమాలకు తమ వంతుగా ఈ విరాళం ఇచ్చినట్లు దాతలు తెలిపారు. ఆపద సమయంలో ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
సీఎం సహాయనిధికి యోగి వేమన సత్రం రూ.2 లక్షల విరాళం - cm relief fund news in kurnool
కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సహాయ నిధికి పలువురు విరివిగా విరాళాలు అందిస్తున్నారు. అహోబిలం యోగి వేమన అన్నసత్రం నిర్వాహకులు సీఎం సహాయ నిధికి రూ.2 లక్షలు విరాళం ఇచ్చారు.
సీఎం సహాయనిధికి యోగివేమన సత్రం రూ.2 లక్షల విరాళం