వైభవంగా ముగిసిన అహోబిలం పవిత్రోత్సవాలు
వైభవంగా ముగిసిన అహోబిలం పవిత్రోత్సవాలు - ahobilam temple in kurnool district
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం క్షేత్రంలో పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఏడాది పొడవునా స్వామివారి పూజా కైంకర్యాల్లో ఏవైనా తప్పులు, లోపాలు జరిగి ఉంటే వాటి నివారణకు పవిత్రోత్సవాలను మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. శ్రీదేవి భూదేవి సమేత జ్వాలా నరసింహమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పవిత్రోత్సవాల్లో అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ పాల్గొన్నారు. పీఠాధిపతి సమక్షంలోనే చివరి రోజు మహా పూర్ణాహుతి జరిగింది.
![వైభవంగా ముగిసిన అహోబిలం పవిత్రోత్సవాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4727245-thumbnail-3x2-ahobilam.jpg)
వైభవంగా ముగిసిన అహోబిలం పవిత్రోత్సవాలు
.
Last Updated : Oct 12, 2019, 1:22 PM IST