కర్నూలు జిల్లాలో.. లక్ష్మీ నరసింహ స్వామి వెలసిన అహోబిల క్షేత్రంలో శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబంరంగా జరిగాయి. సీతారామ, లక్ష్మణ ఉత్సవ మూర్తులకు నవ కలశ పంచామృతాభిషేకం నిర్వహించారు. వేదమంత్రాల నడుమ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి మంగళ హారతులు ఇచ్చారు. కరోనా నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పరిమితంగా భక్తుల నడుమ ఈ ఉత్సవాలను పూర్తి చేశారు.
అహోబిలంలో కన్నుల పండువగా శ్రీరామ నవమి - latest sriramanavani in kurnool district
ప్రతి ఏటా శ్రీరామనవమి వచ్చిందంటే ఆలయ ప్రాంతాలన్నీ వేలాదిమంది భక్తులతో కిటకిటలాడేవి. అయితే ఈ ఏడాది మాత్రం కరోనా వైరస్ కారణంగా ఆలయ ప్రాంగణాలన్నీ బోసిపోయాయి. అహోబిలం క్షేత్రంలో శ్రీరామ నవమి ఉత్సవాన్ని పరిమిత భక్తుల నడుమ నిర్వహించారు.
![అహోబిలంలో కన్నుల పండువగా శ్రీరామ నవమి ahobilam sriramanavami](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6641173-174-6641173-1585887634865.jpg)
అహోబిలంలో కన్నుల పండువగా శ్రీరామ నవమి