రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో కర్నూలు జిల్లా అహోబిలం అటవీ ప్రాంతం కొత్త అందాలను సంతరించుకుంది. వీటికి తోడు పాలనురగల్లాంటి జలపాతాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. ఎగువ అహోబిలం సెలయేళ్లు నూతన శోభతో అలరారుతున్నాయి.
ప్రకృతి అందాలతో అలరారుతోన్న అహోబిలం - అహోబిలం దేవాలయం
రాష్ట్రంలో కురుస్తోన్న వర్షాలతో అహోబిలం పరిసర ప్రాంతాలకు నూతన కళ వచ్చింది. చెట్లు చిగురించడం వల్ల అటవీ ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.
ప్రకృతి అందాలతో అలరారుతోన్న అహోబిలం