ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అహోబిలం బ్రహ్మోత్సవాలు: మోహిని అలంకారంలో ప్రహ్లాద వరదుడు - mohini alankaram at ahobilam

అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బుధవారం మోహిని అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.

ahobilam brahmostavalu
అహోబిలం బ్రహ్మోత్సవాలు

By

Published : Mar 24, 2021, 9:36 PM IST

అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాద వరద స్వామి.. మోహిని అలంకారంలో అహోబిల మాఢ వీధుల్లో విహరించారు. ఈ అలంకారంలో స్వామివారు అపురూపంగా అలంకృతులై.. పల్లకిలో విహరిస్తూ భక్తులకు ఆశీర్వాదాలు అందించారు.

అహోబిల మఠం చేరుకున్న స్వామివారి ఉత్సవ పల్లకి 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ మహాదేశికర్ స్వాగతం పలికి విశేష పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహ మూర్తి, చెంచులక్ష్మి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. రాత్రి దిగువ అహోబిలంలో శరభ వాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తజనులకు దర్శనమివ్వనున్నారు.

ABOUT THE AUTHOR

...view details