ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం గారూ.. ఇచ్చిన హామీని నెరవేర్చండి' - కర్నూలు అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన

ముఖ్యమంత్రి జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ కర్నూలులో అగ్రిగోల్డ్ బాధితులు నిరాహార దీక్ష చేపట్టారు. బడ్జెట్​లో కేటాయించిన నిధుల్ని విడుదల చేయాలని కోరారు.

agrigold victims hunger strike in kurnool
కర్నూలులో అగ్రిగోల్డ్ బాధితుల నిరాహార దీక్ష

By

Published : May 23, 2020, 5:24 PM IST

ఎన్నికలకు ముందు అగ్రిగోల్డ్ బాధితులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. కర్నూలులో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరహార దీక్ష చేపట్టారు. నగరంలోని సీపీఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితులు భౌతిక దూరం పాటిస్తూ.. 48 గంటల దీక్షకు దిగారు.

బడ్జెట్​లో కేటాయించిన 1,150 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చెయ్యాలని కోరారు. సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని సీపీఐ నాయకుడు రామాంజనేయులు విమర్శించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details