ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతులకు నష్టం చేకూర్చే చట్టాలను రద్దు చేయాలి' - కర్నూలు జిల్లా వార్తలు

కర్నూలు జిల్లా సుందరయ్య సర్కిల్​లో వ్యవసాయ, కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. నల్ల చట్టాలతో పాటు విద్యుత్తు బిల్లులను వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరాయి. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశాయి.

labor unions agitation at sundaraiah circle kurnool district
చట్టాలను రద్దు చేయాలి

By

Published : Dec 31, 2020, 4:24 PM IST

వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని కర్నూలు సుందరయ్య సర్కిల్​లో వ్యవసాయ, కార్మిక సంఘాలు ఆందోళన నిర్వహించాయి. కేంద్ర వైఖరికి నిరసనగా ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. రైతులకు నష్టం కలిగించే చట్టాలను వెనక్కి తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. కేంద్రం, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details