కేంద్ర ప్రభుత్వం పేద అగ్రవర్ణాల కోసం ప్రవేశ పెట్టిన పది శాతం రిజర్వేషన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో అమలుచేయాలని కోరుతూ.. ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు.
అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ను అమలు చేయాలని ధర్నా - కర్నూలు తాజా వార్తలు
కేెంద్రం తెచ్చిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లను వెంటనే రాష్ట్రంలో అమలు చేయాలని కోరుతూ ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ అమలుచేయాలని కోరుతూ ధర్నా
ప్రభుత్వ సంక్షేమ పథకాలను కులాలకు అతీతంగా పేదలందరికీ వర్తించే విధంగా రాష్ట్రంలో అమలు జరపాలన్నారు. ప్రతిభ ఉన్నవారికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అగ్రవర్ణాల పేదలకు పదిశాతం రిజర్వేషన్ కల్పంచకుంటే ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.