కర్నూలు జిల్లా ఆదోనిలో భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ట్రాక్టర్ ఇసుక రెండు వేల రూపాయలకు ఇవ్వాలని, కార్మికులకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆదోనిలో భవన నిర్మాణ కార్మికుల ఆందోళన - agitation of construction workers
తమ సమస్యలు పరిష్కరించాలంటూ భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేశారు. డిమాండ్లు తీర్చాలంటూ కర్నూలు జిల్లా ఆదోనిలో ర్యాలీ నిర్వహించారు.
![ఆదోనిలో భవన నిర్మాణ కార్మికుల ఆందోళన agitation of construction workers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9173986-671-9173986-1602678771951.jpg)
ఆందోళన నిర్వహిస్తున్న భవన నిర్మాణ కార్మికులు
భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవాలయం నుంచి శంకర్ నగర్ ఏరియా వరకు ర్యాలీ చేశారు. తరువాత ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో రామకృష్ణకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశాయ్, సంఘం నాయకుడు మల్లికార్జున, కార్మికులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: విశాఖ జిల్లాలో భారీ వర్షాలు... నిండుకుండల్లా జలాశయాలు