కర్నూలు జిల్లా నంద్యాల రెండో పట్టణ పోలీసు స్టేషన్ ఎదుట ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. తమ వర్గానికి చెందిన బిల్డర్ సత్యనారాయణపై 5మంది దాడి చేశారని వాపోయారు. వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్యవైశ్యలంతా ఒక్కటై దాడులను తిప్పి కొట్టాలన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని బాధితుడికి న్యాయం చేస్తామని సీఐ కంబగిరి రాముడు తెలిపారు.
పోలీసు స్టేషన్ ఎదుట ఆర్యవైశ్య సంఘం నేతల ఆందోళన - agitation of Aryavaisya community leaders updates
తమ వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కర్నూలు జిల్లా నంద్యాల పోలీసు స్టేషన్ ఎదుట ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. బాధితుడికి న్యాయం జరిగేలా చేస్తామని సీఐ కంబగిరి రాముడు తెలిపారు.
ఆర్యవైశ్య సంఘం నేతల ఆందోళన
TAGGED:
kurnool district news