రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా నంద్యాలలో న్యాయవాద, ప్రజాసంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. న్యాయవాదులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై భైఠాయించి నిరసన తెలిపారు. వీరి ఆందోళనతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. రాయలసీమలో హైకోర్టు, రాజధాని ఏర్పాటు చేసేంతవరకూ పోరాటం సాగిస్తామని నంద్యాల బార్ అసోసియేషన్ సంఘ అధ్యక్షుడు నాగరాజు అన్నారు.
'రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయండి'
శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా నంద్యాలలో న్యాయవాద, ప్రజాసంఘాలు రాస్తారోకో నిర్వహించాయి.
రాయలసీమలో హైకోర్టు, రాజధాని ఏర్పాటు చేయాలని న్యాయవాదుల రాస్తారోకో
TAGGED:
advocates protest in nandyal