ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సలాం కేసులో పోలీసుల తరఫున వాదించిన న్యాయవాది తెదేపాకు రాజీనామా - కర్నూలు జిల్లా నంద్యాల తాజా వార్తలు

కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం బలవన్మరణానికి పాల్పడ్డ కేసులో పోలీసుల తరుపున తాను వాదించబోనని న్యాయవాది వెదుర్ల రామ చంద్రారావు వెల్లడించారు. తాను వ్యక్తిగతంగా చేసిన పనిని పార్టీకి ఆపాదించి విమర్శలు చేస్తున్నందున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

అబ్ధుల్ సలాం కేసులో తెదేపాకు న్యాయవాది వెదుర్ల రాజీనామా
అబ్ధుల్ సలాం కేసులో తెదేపాకు న్యాయవాది వెదుర్ల రాజీనామా

By

Published : Nov 11, 2020, 11:13 PM IST

Updated : Nov 12, 2020, 10:08 AM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ తరుపు న్యాయవాది వెదుర్ల రామ చంద్రారావు వాదించారు. వాళ్లకు బెయిల్ వచ్చేలా చేశారు. ఈ విషయంలో పార్టీకి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. అయినా కొందరు పనిగట్టుకొని తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే తన వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదని తెదేపా రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

వృత్తే ప్రధానం..

పదవుల కంటే తనకు న్యాయవాది వృత్తే ప్రధానమని ఆయన వివరించారు. సలాం ఆత్మహత్య కేసులో ఉన్న సెక్షన్ల ప్రకారమే బెయిల్ మంజూరైన విషయాన్ని ఆయన పేర్కొన్నారు. ఇందులో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వివరించారు. ఈ క్రమంలో సదరు పోలీసుల తరఫున కేసు వాదించబోనని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : రాష్ట్రమంతా ఆరోగ్యశ్రీ.. ఉత్తర్వులు జారీ

Last Updated : Nov 12, 2020, 10:08 AM IST

For All Latest Updates

TAGGED:

rajinama

ABOUT THE AUTHOR

...view details