రెండు వేర్వేరు కేసుల్లో.. కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2,046 టెట్రా ప్యాకెట్లు, 476 బాటిళ్ల మద్యంతో పాటు స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ తరహా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని.. రెండవ పట్టణ సీఐ చంద్ర శేఖర్ హెచ్చరించారు.
ఆదోనిలో కర్ణాటక మద్యం స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్ - కర్ణాటక మద్యం అక్రమ రవాణాను అడ్డుకున్న ఆదోని పోలీసులు
కర్ణాటక మద్యం అక్రమ రవాణాను.. కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు అడ్డుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో.. నిందితుల నుంచి 2,046 టెట్రా ప్యాకెట్లు, 476 మద్యం బాటిళ్లతో పాటు స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
![ఆదోనిలో కర్ణాటక మద్యం స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్ karnataka liquor caught](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9949638-927-9949638-1608495446438.jpg)
పట్టుకున్న మద్యంతో నిందితులు