ఇటీవల కర్నూలు జిల్లాలో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆదోని 2వ పట్టణ సీఐ శ్రీరాములు తెలిపారు. అందులో భాగంగా ఆదోని పట్టణంలోని ప్రధాన కూడలిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 30 మందిని గుర్తించిన పోలీసులు.. అదుపులో తీసుకున్నారు. పట్టుబడిన వారికి సీఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. వాళ్లను స్థానిక తహసీల్దార్ రామకృష్ణ ఎదుట హాజరు పరుస్తామని పట్టణ సీఐ తెలిపారు.
30 మందిని అదుపులోకి తీసుకున్న ఆదోని పోలీసులు - adoni police latest news
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో రాత్రిపూట అనుమానాస్పదంగా తిరుగుతున్న 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ ఎదుట హాజరు పరుస్తామని 2వ పట్టణ సీఐ శ్రీరాములు తెలిపారు.
30 మందిని అదుపులోకి తీసుకున్న అదోని పోలీసులు