కర్నూలు జిల్లా ఆదోనిలో అధికార పార్టీకి ఉన్నతాధికారులు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండల పరిషత్ కార్యాలయంలో మూడో రోజు నామినేషన్లు స్వీకరించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అక్కడే ఉన్న సీఎం జగన్ ఫొటో మాత్రం అధికారులు తొలిగించడం లేదని ఆరోపిస్తున్నారు. నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్ధలు ఫొటో చూసి అధికారుల తీరుపై పలు విమర్శలు చేస్తున్నారు.
పట్టని ఎన్నికల నియమాలు... ఎక్కడ చూసిన సీఎం ఫొటోలు... - ఆదోనిలో మండల పరిషత్ తాజా వార్తలు
కర్నూలు జిల్లా ఆదోనిలో మండల పరిషత్ కార్యాలయంలో జగన్ ఫొటో ఉన్న పోస్టర్ను తొలంగిచకపోవడం విమర్శలకు తావిస్తుంది. మూడో రోజు నామినేషన్లు స్వీకరిస్తున్నప్పటికీ అదికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు.
![పట్టని ఎన్నికల నియమాలు... ఎక్కడ చూసిన సీఎం ఫొటోలు... Adoni Mandala Parishad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6367738-125-6367738-1583917128253.jpg)
ఆదోనిలో మండల పరిషత్ కార్యాలయంలో జగన్ ఫోటో
ఆదోనిలో మండల పరిషత్ కార్యాలయంలో జగన్ ఫొటో
ఇవీ చూడండి...