ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కర్నూలు జిల్లా ఆదోనిలో ఆటోలు బంద్ చేశారు. ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులు నిరాహార దీక్షలు చేసి.. ఇవాళ ఆటోలు బంద్ పాటించారు. కోట్ల కూడలి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు డ్రైవర్లు భారీ నిరసన ర్యాలీ చేశారు. పోలీసులు ఆటో కార్మికులను వేధిస్తున్నారని ఆన్లైన్లో రుసుము వేయడం వల్ల... అప్పుల బారిన పడుతున్నామని డ్రైవర్లు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. పాత పద్ధతిలోనే డ్రైవర్లకు రుసుము వేయాలని...పెండింగ్లో ఉన్న ఆటో ఫైన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.10 వేలు వద్దని....ప్రజలు ఇచ్చే 10 రూపాయలు ముద్దని అన్నారు.
'పాత పద్దతిలోనే రుసుములు వసూలు చేయాలి' - కర్నూలు జిల్లా ఆదోనిలో ఆటోకార్మికులు నిరసన
పాత పద్దతిలోనే ఆటోల రుసుములు వసూలు చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా ఆదోనిలో ఆటో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.

పాత పద్దతిలోనే రుసుములు వేయాలంటూ ఆదోనిలో ఆటో కార్మికులు నిరసన
పాత పద్దతిలోనే రుసుములు వేయాలంటూ ఆదోనిలో ఆటో కార్మికులు నిరసన