కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్డీవో బాలగణేశయ్య సాధారణ వ్యక్తిగా వెళ్లి కూరగాయలు తీసుకున్నారు. పట్టణంలోని పురపాలక మైదానంలో ఏర్పాటు చేసిన మార్కెట్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలు అమలు చేస్తున్నారో లేదో తెలుసుకోవటానికి పంచె కట్టులో వచ్చి కూరగాయలు కొనుగోలు చేసినట్టు తెలిపారు. 2 దుకాణాల్లో మిరపకాయలు కిలోకు ఐదు రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని... అడిగితే జవారీ ధరలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారని అన్నారు. మిగతా ధరల్లో తేడా లేదని ఆర్డీఓ చెప్పారు.
గెటప్ మార్చిన ఆదోని ఆర్డీవో.. ఎందుకంటే! - #corona virus in andhrapradesh
పోలీసులు సాధారణ వ్యక్తిలా స్టేషన్లోకి ఎంటరై సహోద్యోగులకు షాక్ ఇచ్చిన ఘటనలను సినిమాల్లో చూస్తుంటాం. అంతేరీతిలో ఆర్డీవో బాలగణేశయ్య... సాధారణ వ్యక్తిలా కర్నూలు జిల్లా ఆదోని రైతుమార్క్ట్కు వెళ్లి కూరగాయల ధరలు పరిశీలించారు. ధరల్లో తేడా ఉందేమోనన్న అనుమానంతో ఇలా చేసినట్లు తెలిపారు.
adhoni RDO change his getup and went to vegitable market