మంత్రాలయంలో సినీనటి హన్సిక సందడి కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని సినీనటి హన్సిక దర్శించుకున్నారు. మఠాధికారులు ఆమెకు స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకున్న ఆమె... అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు. సినీ నటి హన్సికను చూసి.. సెల్ఫీలు దిగేందుకు అభిమానులు భారీగా ఎగబడ్డారు.