ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్‌ బియ్యం పట్టుకుని వదిలేశారు.. ఇద్దరు పోలీసులు, హోంగార్డుపై కేసు నమోదు - రేషన్‌ బియ్యం పట్టుకుని వదిలేసిన పోలీసులపై కేసు నమోదు

Action on police: కర్నూలు జిల్లా మద్దికెరలో రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని.. వదిలేసిన ముగ్గురిపై కేసు నమోదైంది. కాగా.. వీరిలో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు ఉన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నారు.

Action on police over ration rice was seazed and released
పోలీసులపై కేసు నమోదు

By

Published : Jun 9, 2022, 12:41 PM IST

Action on police: కర్నూలు జిల్లా మద్దికెరలో రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని.. వదిలేసిన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు పై కేసు నమోదైంది. రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో.. ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డు వెళ్లి వాహనాన్ని పట్టుకున్నారు. అనంతరం అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఫోన్ చేసి బెదిరించడంతో వాహనాన్ని వదిలేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. ఈ విషయం ఎస్పీ దృష్టికి వెళ్లింది. బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నారు.

ABOUT THE AUTHOR

...view details