ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Srisailam : శ్రీశైలంలో రేపటి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం - Srisailam temple news

Srisailam : శ్రీశైల మహాక్షేత్రంలో శనివారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం కానున్నాయి. గర్భాలయ అభిషేకం, కుంకుమార్చన, ఆర్జిత సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మరోవైపు నేటితో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Srisailam
Srisailam

By

Published : Mar 4, 2022, 10:05 PM IST

Srisailam : శ్రీశైలంలో రేపటి(శనివారం) నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం కానున్నాయి. మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం పునఃప్రారంభం కానుంది. గర్భాలయ అభిషేకం, కుంకుమార్చన, ఆర్జిత సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కరెంట్, ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా ఆర్జిత సేవల టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 6 నుంచి రోజుకు మూడుసార్లు సామూహిక అభిషేకాలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

చివరి రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..
శ్రీశైల మహాక్షేత్రంలో ఈ ఫిబ్రవరి 22న మొదలైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. అశ్వవాహనంపై కొలువై స్వామిఅమ్మవార్లు పూజలందుకున్నారు. రాత్రి 10 గంటలకు స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం, శయణోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చివరగా ఏకాంత సేవతో.. 11 రోజుల నుంచి వైభవంగా జరుగుతోన్న బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఇదీ చదవండి:Sivarathri in Srisailam: శ్రీశైలంలో కన్నులపండువగా ఆది దంపతుల కల్యాణం

ABOUT THE AUTHOR

...view details