మంత్రాలయం వద్ద ప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం - మంత్రాలయం వద్ద ప్రమాదం, తప్పిన ప్రాణనష్టం
08:59 September 10
సురక్షితంగా బయటపడిన 8 మంది ప్రయాణికులు
కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండగా టెంపో ట్రావెలర్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. బెంగళూరు నుంచి మంత్రాలయంకు దర్శనార్థం వస్తుండగా తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పొలంలో పడి ఉన్న మిని టెంపో బస్సును స్థానికులు జేసీబీ సహయంతో తొలగించారు.
ఇదీ చదదవండి:లిఫ్ట్ అడిగింది..పాపం అని ఇచ్చాడు..కానీ దిగగానే ఏం చేసిందంటే.. !