ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డ్రైవర్ నిర్లక్ష్యం... రెండేళ్ల పాప మృతి - accident news in kurnool district

ఆడుకుంటున్న రెండేళ్ల పాపపై బోలెరా వాహనం ఎక్కిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో పాప అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

accident at racchamarri in kurnool district
రెండేళ్ల పాపపైకి ఎక్కిన బోలెరా వాహనం

By

Published : Mar 2, 2021, 10:34 PM IST

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఆడుకుంటున్న రెండేళ్ల పాపపై బొలెరా వాహనం ఎక్కింది. పాప అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన మజ్జిగ చిన్న నరసింహులు, నరసమ్మ దంపతుల కూతురు శైలజ. మంగళవారం ఉదయం శైలజ వారి ఇంటి ముందు ఆడుకుంటుది. అదే సమయంలో నీటిని విక్రయించేందుకు బొలెరా వాహనం వచ్చింది. ఆడుకుంటున్న పాపను గమనించకుండా వాహనాన్ని ముందుకు కదిలించటంతో ప్రమాదం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details