ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవినీతి నిరోధక దినోత్సవం రోజున...లంచం తీసుకుంటూ చిక్కాడు! - కర్నూల్ సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు

ప్రపంచ అవినీతి నిరోధక దినోత్సవం రోజున లంచం తీసుకుంటూ కర్నూలులో ఓ అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ.5వేలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

acb rides on Kurnool Sub Registrar's Office at kurnool district
కర్నూల్ సబ్ రిజిస్ట్రార్​ను రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ నాగభూషణం

By

Published : Dec 9, 2019, 11:06 PM IST

కర్నూల్ సబ్ రిజిస్ట్రార్​ను రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ నాగభూషణం

కర్నూలు నగరంలోని కర్నూల్ సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయ జాయింట్ 1 సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ వలలో పడ్డాడు. ఓ సంస్థ యజమాని నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ ‌ షేక్‌ మహబూబ్ అలీ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. కర్నూలుకు చెందిన హిమాలయ ఔషధ సంస్థ యాజమాని జగన్ మోహన్ లీజ్‌ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు నాలుగు రోజుల కింద దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ పని కోసం సబ్ రిజిస్ట్రార్‌ షేక్ మహబుబ్‌ అలీ లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని జగన్ మోహన్‌ ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ అయిన 14400కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సోమవారం కర్నూల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మహబూబ్ అలీ తన కంప్యూటర్ ఆపరేటర్ అయిన షామీర్ ద్వారా లంచం రూ.5,000 తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ నాగభూషణం రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ఇద్దరినీ మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details