ఆదోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ దాడులు జరిగాయి. రైతు గోవిందరాజులు నుంచి వీఆర్వో మల్లికార్జున రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఇటీవలే గోవందరాజు తండ్రి మృతి చెందడం వల్ల తమ పేరుపై పట్టా మార్చాలని కోరడం వల్ల వీఆర్వో రూ.40 వేలు డిమాండ్ చేశాడని ఆయన తెలిపారు. అంత డబ్బు ఇవ్వలేక అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశానని రైతు తెలిపాడు. నిందితుడు మల్లికార్జునపై విచారణ ప్రారంభించినట్టు ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్వో - acb raids on adoni tahsildar office and caught vro
ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీ వలకు చిక్కాడు. ఈ ఘటన ఆదోని తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
తహసీల్దార్ కార్యాలయంలో పట్టుబడ్డ వీఆర్వో