ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బయటపడుతున్న గూడూరు తహసీల్దార్ హసీనాబీ లీలలు - కర్నూలులో అనిశా దాడుల వార్తలు

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కి పరారీలో ఉన్న గూడూరు తాహసీల్దార్ షేక్ హసీనాబీ కోసం అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ తనిఖీలలో భాగంగా కర్నూలు సీక్యాంప్​లో సోదాలు చేశారు.

ఎంపీడీవో గిడ్డయ్యతో గూడూరు తాహసీల్దార్ షేక్ హసీనాబీ

By

Published : Nov 13, 2019, 12:29 PM IST

గూడూరు తాహసీల్దార్ షేక్ హసీనాబీ గురించి బయటపడ్డ ఆసక్తికర విషయాలు

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కి పరారీలో ఉన్న కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ షేక్ హసీనాబీ గురించి ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. జిల్లాలోని కొత్తపల్లి మండలం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న గిడ్డయ్యతో ఆమె సహ జీవనం చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నగరంలోని సీక్యాంప్​లో గిడ్డయ్య నివాసం ఉన్న సీ/బీ-40 క్వార్టర్​ను అధికారులు తనిఖీ చేయగా... వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు బయటపడ్డాయి. వీరిద్దరికి వివాహం కాలేదు.

ఈనెల 7వ తేదీన గూడూరుకు చెందిన ఓ రైతు తన పొలాన్ని ఆన్​లైన్​లో నమోదు చేయడానికి హసీనాబీ రూ.4 లక్షలు లంచం డిమాండ్ చేశారు. రైతు నుంచి నగదును హసీనాబీ సొంత అన్న మహబుబ్ బాషా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. అప్పటినుంచి హసీనాబీ పరారీలో ఉండగా... ఆమెకు ఆశ్రమం కల్పించినందుకు గిడ్డయ్యపై కేసు నమెదు చేసినట్లు డీఎస్పీ నాగభూషణం తెలిపారు.

ఇదీచూడండి.అనిశా వలలో గూడూరు తహసీల్దార్... అనుచరుడు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details