శ్రీశైలం దేవస్థానంలో 2016 నుంచి ప్రైవేటు సత్రాల్లో భక్తులకు విక్రయించిన అభిషేకం టికెట్ల వివరాల గురించి అనిశా ఆరా తీసింది. అభిషేకం టిక్కెట్లు విక్రయించిన సమయంలో సత్రాల నిర్వాహకులు రికార్డులను అమలు పరిచారా? లేదా? అన్న కోణంలో జాయింట్ డైరెక్టర్ గంగాధర్ విచారించారు. టికెట్లను విక్రయించాక నగదును దేవస్థానంలో చెల్లించారా? చెల్లింపుల్లో ఏమైనా అక్రమాలు జరిగాయా? లేదా? అని వివరాలు సేకరించారు. అనుమానం ఉన్న సత్రాల సిబ్బందిపై ప్రత్యేక దృష్టితో విచారిస్తున్నారు.
శ్రీశైలం దేవస్థానం టికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరం
శ్రీశైల దేవస్థానం ఆర్జిత సేవల టికెట్ల అక్రమాలపై అనిశా (అవినీతి నిరోధక శాఖ) విచారణను ముమ్మరం చేసింది. అనిశా జాయింట్ డైరెక్టర్ గంగాధర్ దేవస్థానం విరాళాల కేంద్రం, టోల్ గేట్ కౌంటర్లు, పలు సత్రాల్లోని కౌంటర్లను తనిఖీ చేశారు.
acb investigation on srisailam tickets scam