ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం అక్రమాలపై అనిశా విచారణ వేగవంతం - శ్రీశైలం అక్రమాలపై అనిశా విచారణ వేగవంతం

శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అక్రమాలపై అనిశా అధికారులు విచారణ వేగవతం చేశారు. నిందితులను విచారించిన అధికారులు.. దేవస్థానంలో రికార్డులను తనిఖీ చేశారు.

శ్రీశైలం అక్రమాలపై అనిశా విచారణ వేగవంతం !
శ్రీశైలం అక్రమాలపై అనిశా విచారణ వేగవంతం !

By

Published : Jun 25, 2020, 7:40 PM IST

కర్నూలు జిల్లా శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అవినీతి అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ చేపట్టారు. నిందితులను ఉదయం నుంచి శ్రీశైలం పోలీస్ స్టేషన్​లో ఏసీబీ అధికారులు విచారించారు. టిక్కెట్ల కుంభకోణంపై నిందితుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. అప్పటి సిస్టం అడ్మిన్​ను కూడా ఏసీబీ అధికారులు విచారించారు.

సాయంత్రం అనిశా జాయింట్ డైరెక్టర్ తన బృందంతో దేవస్థానం పరిపాలన భవనానికి చేరుకున్నారు. దేవస్థానంలో రికార్డులను అధికారులు తనిఖీలు చేశారు. శుక్రవారం కూడా అనిశా అధికారులు విచారణ చేయనున్నట్లు తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details