కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం న్యాయపోరాట సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. సలాం కుటుంబం ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించాలని సమితి రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్ తెలిపారు. వామపక్షాలతో పాటు పలు పార్టీల నాయకులు, ముస్లిం ప్రజా సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
'అబ్దుల్ కుటుంబ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలి'
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య సంఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు నంద్యాలలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు
రౌండ్ టేబుల్ సమావేశంలోని అంశాలు
* సీబీఐ విచారణ జరిపించాలని అసెంబ్లీలో తీర్మానించాలి
* శాసనమండలిలో చర్చించాలి
* ఈ నెల 30 న రాస్తారోకో
* డిసెంబరు లో ఆందోళన కార్యక్రమాలు
ఇదీ చదవండి: