మానవత్వాన్ని చాటుకున్న అంగన్వాడి ఆయా - పురిటి నొప్పులు
కర్నూలు జిల్లాలో అంగన్వాడి ఆయా మానవత్వాన్ని చాటుకుంది. పురిటి నొప్పులతో బాధ పడుతున్న గర్భిణిని ఆసుపత్రికి తరలించి తన సేవా ధృక్పథాన్ని చాటుకుంది.
కర్నూలు జిల్లాలో అంగన్వాడి ఆయా మానవత్వాన్ని చాటుకుంది. నంద్యాల పట్టణానికి చెందిన దివ్యభారతి అనే నిండు గర్భిణికి శుక్రవారం పురిటి నొప్పులు రాగా లాక్డౌన్ కారణంగా కర్నూలులో ఉన్న ఆమె తల్లి రాలేకపోయింది. అదే కాలనీకి చెందికి అంగన్వాడి ఆయా చెన్నమ్మకు సహాయం చేయాలని దివ్యభారతి కోరగా.. మానవత్వంతో స్పందించి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి రెండు రోజులు ఆమెతోనే ఉండి కాన్పు చేయించింది. దివ్యభారతికి కూమరుడు జన్మించాడు. ఐసీడీఎస్ అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న కలెక్టర్ వీర పాండియన్ చెన్నమ్మ సేవకు మెచ్చి తక్షణమే 20 వేల నగదు బహుమతి ప్రకటించారు.