కర్నూలులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నగరంలోని కేసీ కెనాల్లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడని స్థానికులు తెలిపారు. కర్నూలు కప్పల్నగర్ చెందిన మధుగా పోలీసులు గుర్తించారు. సోమవారం రాత్రి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన మధు ఉదయం కేసి కాలువలో శవమై తేలాడు. మధు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పుట్టినరోజు వేడుకకు వెళ్లాడు..కాలువలో శవమై తేలాడు - Kurnool latest news
పుట్టినరోజు వేడుకకు వెళ్లిన యువకుడు శవమై నీటిలో తేలాడు. ఈ ఘటన కర్నూలులో జరిగింది. యువకుని మృతిపై అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పుట్టిన రోజు వేడుకకు వెళ్లిన యువకుడు... శవమయ్యాడు!