ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అడవి కుక్కల దాడిలో మరణించిన వన్యప్రాణి - వన్యప్రాణి మీద దాడి చేసిన అడవి కుక్కలు

అడవి కుక్కలు వెంటపడితే వాటిని తప్పించుకునే క్రమంలో ఓ వన్యప్రాణి ప్రాణాలు విడిచింది. శ్రీశైలం అడవుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

wild dogs attack
అడవి కుక్కల దాడీలో మరణించిన ఓ వన్యప్రాణి

By

Published : Nov 4, 2020, 2:12 PM IST

అడవి కుక్కల దాడిలో ఓ వన్య ప్రాణి గాయపడి ప్రాణాలు విడిచింది. శ్రీశైలం ఆనకట్ట సమీపంలో దట్టమైన అడవిలో అడవి కుక్కలు కణితి వెంటపడ్డాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో... లింగాల గట్టు గ్రామం వద్ద ఉన్న కొండచరియల పై నుంచి కణితి కిందపడి గాయపడింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులు ఆ జంతువుని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృత్యువాత పడింది.

ABOUT THE AUTHOR

...view details