కర్నూలు జిల్లా డోన్ మండలం ఆవులదొడ్డి గ్రామం గోవుకు సమాధి నిర్మించింది. అంతేకాకుండా 22 ఏళ్లుగా ఆ సమాధికి గ్రామస్థులు పూజలు చేస్తున్నారు. గతంలో గ్రామంలోని పెద్ద హనుమన్న అనే రైతు ఆవును పెంచేవారు. దాని ముఖంలోని ప్రత్యేకతను స్థానికులు గమనించి ప్రత్యేక పూజలు చేసేవారు. కాలక్రమంలో ఆవు మృతి చెందటంతో గ్రామస్థులంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారికి పక్కనే సమాధి కట్టారు. అప్పటి నుంచి ఆ ఊరి ప్రజలు ఎక్కడికైనా ప్రయాణించాలన్నా.... శుభకార్యానికి వెళ్లాలన్నా ముందుగా గోమాత సమాధికి మొక్కుతారు.
ఆవుకు సమాధి... 22 ఏళ్లుగా పూజలు!
గోవును పూజిస్తే సకల దేవతలనూ పూజించినట్టేనని విశ్వాసం. కర్నూలు జిల్లాలోని ఆవులదొడ్డి గ్రామస్థులు మరో అడుగు ముందుకేసి గోవుకు ఏకంగా సమాధి నిర్మించారు. 22 ఏళ్లుగా ఆ సమాధికి పూజలు చేస్తూ భక్తిని చాటుకుంటున్నారు.
A villagers in kurnool district built a tomb for the cow and Worshipping from 22 years