తమ గ్రామం సుభిక్షంగా ఉండాలని కర్నూలు జిల్లా ఆదోని మండలం నారాయణపురం గ్రామస్థులంతా గర్జలింగేశ్వర స్వామికి పూజలు చేసి సహపంక్తి భోజనం చేశారు. వందల సంత్సరాల నుంచి గ్రామంలో ఈ ఆచారం కొనసాగుతోంది. ప్రతి ఏడాది కార్తీక మాసం ముగిసిన తరువాత వచ్చే ఆదివారం, సోమవారం రెండు రోజులు గర్జలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని గ్రామస్థులు చెబుతున్నారు. అనంతరం ప్రతి ఇంటి నుంచి అన్నం తెచ్చి దేవాలయంలో రాసిగా పోసి.. సాంబారు మాత్రమే గుడిలో వండుతామని తెలిపారు. పూజలు తరువాత కుల, మత బేధాలు లేకుండా... సామూహిక భోజనం చేస్తామని వారు తెలిపారు. ప్రతి ఏడాది ఇలా పూజలు చేయడం వల్ల గ్రామంలో కరవు, కాటకాలు రావని దేవాలయ కమిటీ అధ్యక్షుడు లింగారెడ్డి అన్నారు.
వందల ఏళ్ల నాటి ఆచారం.... నేటికీ ఆచరణ - నారాయణపురం వార్తలు
కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఓ ఆచారం కొనసాగుతోంది. కార్తీక మాసం ముగిసిన తరువాత వచ్చే ఆదివారం, సోమవారం ఆ గ్రామస్థులంతా స్థానిక ఆలయానికి చేరుకొని పూజలు చేస్తారు. అనంతరం సామూహిక భోజనాలు చేస్తారు. దీనివల్ల గ్రామంలో ఎలాంటి సమస్యలు దరిచేరవని వారి నమ్మకం.
నారాయణపురం గ్రామస్తుల పూజలు