AP Student died In America: కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి అనే యవతి అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. సీయోటెల్‌లో రోడ్డు దాటుతుండగా పోలీసు వాహనం ఢీకొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జాహ్నవి నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతుందని చెప్పారు. ఇప్పటివరకు బ్యాంకు రుణంతో 70 లక్షల వరకు ఖర్చు అయిందని.. మరో నాలుగు నెలల్లో మంచి ఉద్యోగం వచ్చేదని.. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని ఆమె తాతయ్య తెలిపారు. తానా అసోసియేషన్ ద్వారా మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. అదోనికి చెందిన విద్యార్థిని మృతి - అమెరికాలో మహిళ మృతి
AP Student died In America: అమెరికాలో తెలుగు యువతి జాహ్నవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. నిన్న మంగళవారం సీయోటెల్ నగరంలో రోడ్డు దాటుతుండగా పోలీసు వాహనం ఢీకొని మృతి చెందిందని కుటుంబసభ్యులు తెలిపారు. మృతురాలిది కర్నూలు జిల్లా ఆదోని పట్టణం. జాహ్నవి మరణంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
విద్యార్థిని