కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో తల్లిని రాయితో తలపై మోది కుమారుడు కిరాతకంగా హత్య చేశాడు. లక్ష్మీపేటలో ఉంటున్న రాజు, ఉరుకుందమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. పెద్ద కుమారుడు వీరేష్ జులాయిగా తిరుగుతుండగా... చిన్న కొడుకు ఉదయకుమార్ ఎంటెక్, కూతురు త్రిబుల్ ఐటీ చదువుతోంది. వీరేష్ తాగి వచ్చి తండ్రితో గొడవపడ్డాడు. వీరిద్దరి మధ్య మాటమాట పెరిగింది. ఈ క్రమంలో తండ్రిని బండరాయితో హత్య చేయబోతుండగా.. తల్లి అడ్డుకుంది. అడ్డొచ్చిన తల్లి తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కన్నతల్లిని బండరాయితో మోది చంపిన కిరాతకుడు - ఎమ్మిగనూరులో కన్నతల్లిని చంపిన కుమారుడు తాజా వార్తలు
జులాయిగా తిరగటమే కానీ బాధ్యతలు తెలియని ఓ కుమారుడు తల్లినే హతమార్చాడు. మద్యం సేవించి తల్లిదండ్రులతో గొడవ పడ్డ కిరాతకుడు... అడ్డొచ్చిన తల్లిని బండరాయితో మోది చంపేశాడు.
a son who killed his mother at Emmiganuru in kurnool district