కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎన్జీవో కాలనీలో నిషేధిత గుట్కాను తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జగదీశ్ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై గుట్కా తీసుకెళ్తుండగా పట్టుబడ్డాడు. అతని నుంచి నలభై ఎనిమిది వేల రూపాయలు విలువ చేసే గుట్కా, బైక్ను స్వాధీనం చేసుకున్నారు.
గతంలో కూడా అతను గుట్కా తరలింపులో నిందితుడుగా ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అతన్ని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.