ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాతలు పెట్టిందని కోడలిపై  అత్త కేసు...! - కన్న కూతురుకి వాతలు పెట్టిన తల్లి

ఆడుకున్న పిల్ల పిలిస్తే పలకు..ఎందుకంటే తన ధ్యాసంతా ఆటమీదే ఉంటుంది..ఆ చిన్న విషయం మరచిన ఓ తల్లి కర్కశంగా తన పాపకు ఒళ్లంతా వాతలు పెట్టింది. పాపం పాప..గాయాల వల్ల వచ్చే మంటలు తట్టుకోలేక బోరున ఏడుస్తుంది.

కన్నతల్లి కర్కశత్వం..పిలిస్తే పలకలేదని కూతురికి వాతలు

By

Published : Sep 26, 2019, 5:11 PM IST

కన్నతల్లి కర్కశత్వం..పిలిస్తే పలకలేదని కూతురికి వాతలు
కన్న కూతురునే కనికరం లేకుండా విచక్షణా రహితంగా వాతలు పెట్టిన కసాయి తల్లి బాగోతం కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని అవుకు మండలం మెట్టుపల్లికి చెందిన ప్రశాంతికి బిందు భార్గవి అనే 8 ఏళ్ల కుమార్తె ఉంది. వీధిలో ఆడుకుంటున్న కుమార్తె ఎంత పిలిచినా రాకపోవటంతో ఆగ్రహానికి గురైన తల్లి ఆ పాపకు చేతులపై వాతలు పెట్టింది. విషయం తెలుసుకున్న నానమ్మ లక్ష్మిదేవి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. గాయాలతో నరకం చూస్తున్న పాపను చూసి నాన్నమ్మ బోరున విలపిస్తున్నారు. బాధితురాలితో కలసి తల్లి మూడేళ్ల క్రితం వరకు కర్నూలులో ఉండేవారు. భర్త అనారోగ్యంతో చనిపోవటంతో ప్రస్తుతం మెట్టుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details