కరోనాతో వలస కూలీలు సొంతూళ్లు చేరుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిహారీ అనే వ్యక్తి కడపలో మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. లాక్ డౌన్‌తో పనిదొరక్క ఈ నెల 7వ తేదీన తన కుటుంబ సభ్యులు 8 మందితో కలిసి కాలినడకన బయలుదేరారు. డోలిలో ఇద్దరు చిన్నారులను కూర్చోబెట్టుకుని ఆదోని నుంచి ఎమ్మిగనూరు మీదుగా వెళ్లారు. వీరి అవస్థలను చూసి పోలీసులు జగదీష్, శివరామయ్య, మల్లయ్య... మానవత్వంతో వారిని వాహనంలో కర్నూలు వరకు వాహనంలో పంపారు. లాక్ డౌన్ తో ఇక్కడికి వచ్చి చిక్కుకుపోయామని వలసకూలీలు ఆవేదన చెందారు. పస్తులు ఉండలేక స్వరాష్ట్రానికి కాలినడకన బయలుదేరామన్నారు.
కంటి పాపలకు కావడి కట్టి.. భారంతో అడుగులు వేసి - kurnool dst corna news
లాక్ డౌన్ వల్ల వలస కూలీలు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. సొంతూళ్లకు వెళ్లేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కడపలో మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బిహారీ అనే వ్యక్తి తన స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌కు ఈ నెల 7వ తేదీన తన కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన బయలుదేరారు.
a migrate worker started to go his own state on foot and arrange dolli to carry his two small kids at kurnool dst
Last Updated : May 16, 2020, 8:33 AM IST