theft: కర్నూలు జిల్లా (kurnool district) ఆళ్లగడ్డలో బుధవారం భారీ చోరీ జరిగింది. పట్టణ పరిధిలోని షాది ఖానా వద్ద ఉన్న వెంకటేశ్వర్ రెడ్డి అనే న్యాయస్థాన ఉద్యోగి ఇంట్లో దొంగలు పడి... 50 తులాల బంగారం,రూ.రెండు లక్షల నగదును చోరీ చేశారు. వెంకటేశ్వర్ రెడ్డి అతని భార్య ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో బుధవారం ఉదయం విధుల్లోకి వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి బీరువా తెరిసి ఉండటం, ఇంట్లోని వస్తువులు చిందరవందరగా ఉండటంతో చోరీ జరిగిందని భావించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కర్నూలు నుంచి క్లూస్ టీంను రప్పించి.. ఆధారాలు సేకరిస్తున్నారు.
theft: పట్టపగలే చోరీ... భారీగా బంగారం నగదు మాయం - kurnool district theft news
కర్నూలు జిల్లా(kurnool district)లో పట్టపగలే భారీ చోరీ(theft) జరిగింది. న్యాయస్థాన ఉద్యోగి ఇంట్లో దొంగలు పడి.. 50 తులాల బంగారం, రూ.రెండు లక్షల నగదును తస్కరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
theft