ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్ట్ - ఆదోని పోలీస్

అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడు ఓ కామాంధుడు. దుకాణానికి వెళ్లిన పాపపై అసభ్యంగా ప్రవర్తిస్తూ లోబరుచుకోబోయాడు. ఇంతలోనే పాప తండ్రి అక్కడకు చేరుకోవడంతో ఆ నీచుడి దాష్టీకం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది.

a man sexually harassed  five year old girl
ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

By

Published : Jul 7, 2021, 12:51 AM IST

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడు ఓ ప్రబుద్ధుడు. దుకాణానికి వెళ్లిన ఆ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఇంతలోనే చిన్నారి తండ్రి అక్కడకు చేరుకోవడంతో కామాంధుడి ఘాతుకం బయటపడింది. దీనిపై పాప తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో వెలుగుచూసింది.

పట్టణంలోని నారాయణ గుంతలో చంద్రన్న అనే వ్యక్తి కిరణ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇంటి నుంచి చంద్రన్న షాప్​కి బాలిక వెళ్లింది. దుకాణానికి వెళ్లి చాలా సమయం అయిన ఇంకా రాకపోవడంతో చిన్నారి తండ్రి దుకాణనికి వెళ్లి చూడగా.. బాలికపై అసభ్యంగా ప్రవర్తిస్తూ చంద్రన్న కనిపించాడు. దీంతో వెంటనే విషయం తెలుసుకున్న కుటుంబీకులు పట్టణ రెండో పోలీస్ స్టేషన్​లో అతనిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుణ్ని అరెస్ట్​ చేశారు. షాప్​కి వెళ్లిన వారిపై అసభ్యంగా ప్రవర్తించేవాడని.. చిన్నారిపై అఘాయిత్యానికి ప్రయత్నించిన చంద్రన్నను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details