ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెల్దుర్తి ప్రమాదం: బయటపడిన చిన్నారులకు ఆర్థిక సాయం - వెల్దుర్తి రోడ్డు ప్రమాదం తాజా సమాచారం

కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు చిన్నారులకు ఓ వ్యక్తి యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ప్రమాదంలో కుటుంబాలను పొగొట్టుకున్న ఈ చిన్నారులు ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

donation
వెల్దుర్తి రోడ్డు ప్రమాదంలో బయటపడిన చిన్నారులకు ఆర్థిక సాయం

By

Published : Feb 16, 2021, 4:42 PM IST

కర్నూలు జిల్లా వెల్దుర్తిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షేమంగా బయటపడిన నలుగురు చిన్నారులకు ఓ వ్యక్తి యాభై వేల రూపాయల ఆర్థిక సాయంగా అందించారు. ఈనెల14న తెల్లవారుజామున మాదాపూర్ గ్రామం వద్ద టెంపో.. లారీని ఢీకొట్టటంతో 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన 14 మంది మరణించగా.. నలుగురు చిన్నారులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

వీరు ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ చిన్నారులను ఐసీడీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కర్నూలుకు చెందిన కరిముల్లా అనే వ్యక్తి వీరి ఖర్చుల నిమిత్తం.. యాభై వేల రూపాయలను ఆర్థిక సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. సాయం చేసిన వ్యక్తిని మూడో పట్టణ సీఐ తబ్రేజ్ అభినందించారు.

ఇదీ చదవండీ..వెల్దుర్తి ప్రమాద బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం

ABOUT THE AUTHOR

...view details